ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పీ ఏ తన విడాకుల విషయంలో బెదిరిస్తున్నాడు: బాధితుడు హరీష్
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పీఏ తన విడాకుల విషయంలో బెదిరిస్తున్నాడని అనంతపురం కు చెందిన హరీష్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హరీష్ మాట్లాడిన వీడియోను వైసీపీ ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. మంత్రి పీఏ తనకు రెండు ప్లాట్లు, ఇల్లు, రూ. 30 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఇవ్వకపోతే విడాకులు ఫైలు ముందుకు కదలని బెదిరించాడన్నారు. బాధితుడు హరీష్ ఆంగ్లంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.