గిద్దలూరు: కొమరోలు మండలంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జరిమానా, జైలు శిక్ష విధించిన గిద్దలూరు కోర్టు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి గిద్దలూరు కోర్టు శుక్రవారం రూ.10 వేలు జరిమానా పది రోజులు జైలు శిక్ష విధించింది. కొమరోలు మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన ఎస్ఐ నాగరాజు మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు నిందితుడికి జరిమానా జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి భరత్ చంద్ర తీర్పు ఇచ్చారు.