మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంగా అక్రమంగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యం, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
మార్కాపురం జగదీశ్వరి థియేటర్ రోడ్డు రామాలయం గుడి సమీపంలో ఉన్న రేషన్ డీలర్ స్వయంగా బుధవారం రాత్రి మినీ వ్యాన్ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదారిలో అక్రమాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారని బహిరంగంగా లబ్ధిదారులు విమర్శించారు. జూలై ఒకటో తేదీ రోజే ఈ విధంగా తరలించడంపై స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్ గా మారింది