గిద్దలూరు: విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న గిద్దలూరు బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో గురువారం గిద్దలూరు బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. తమకు 580 కి పైగా మార్కులు రావడానికి విద్యార్థులు ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయుల కృషితో తాము మంచి మార్కులు సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని విద్యార్థులు కోరారు.