కొండపి: గత వైసిపి పాలనలో దళితులపై అధికంగా దాడులు జరిగాయి: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా దళితులపై దాడులు, దౌర్జన్యాలే అని మంత్రి స్వామి ఆరోపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ బలి, వైసీపీ నేతల ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు రాజమండ్రిలో దళితుడికి శిరోమండనం, మద్యం మాఫియాను ప్రశ్నించినందుకు చిత్తూరులో ప్రతాప్ చంపారని ఆరోపించారు.