గిద్దలూరు: రాచర్ల మండలం అనుములవీడు గ్రామంలో దేవుడు ఆవులు రెండు మాయం, పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుములవీడు గ్రామంలో దేవుడి ఆవులు రెండు మాయమయ్యాయి. గ్రామంలో ఐదు ఆవులను దేవుడి కోసం విడిచిపెట్టిన గ్రామస్తులు వాటిని రోజు ఆహారం పెడుతూ సంరక్షిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా రెండు ఆవులు కనిపించడం లేదని లిఖితపూర్వకంగా ఎస్సై కోటేశ్వరరావుకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఎస్సై కోటేశ్వరరావు ఆవులు అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.