తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కోరారు. అనంతపురంలోని జడ్పీ కార్యాలయంలో IAB సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కనీసం మెయింటైన్ చేసేందుకు కూడా డబ్బులు లేవన్నారు. దాదాపు 45 KMలు సొంత ఖర్చులతో చేయించానన్నారు. ఎప్పుడూ చూడని విధంగా నీటిని చూస్తున్నామన్నారు.