రాయదుర్గం: పట్టణంలో తాగునీటి కోసం మరోసారి ఖాళీ బిందెలతో రోడ్డెకెన మహిళలు
రాయదుర్గంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఆదివారం కోతిగుట్ట వద్ద అనంతపురం హైవేపై మహిళలు ఖాళీ బిందెలతో అరగంట పాటు నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. 8-10 రోజులకోసారి వచ్చే నీరు కూడా అరగంట ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ లైన్ మెన్ మధ్యాహ్నంలోపు నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నీటి నిర్వహణ లోపంతో ఇటీవల ధర్నాలు మామూలయ్యాయి. ఇప్పటికైనా సకాలంలో నీరు ఇవ్వాలని పట్టణవాసులు కోరుతున్నారు.