దర్శి: పోలేపల్లి గ్రామంలో పోలేరమ్మ తిరుణాల లో పాల్గొన్న వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | May 21, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి గ్రామంలో పోలేరమ్మ తిరుణాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైసిపి పార్టీ నాయకులూ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ పై ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని వైసిపి పార్టీ నాయకులను అరెస్టు చేయడమే పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మాజీ సీఎం జగన్ మరొకసారి గెలిపించుకోవాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.