రాయదుర్గం: పట్టణంలోని మల్లాపురం లేఅవుట్ లో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మద్యం తాగుడుకు అలవాటు పడి చేసిన అప్ఫులు తీర్చలేక రాయదుర్గం పట్టణంలోని మల్లాపురం లేఅవుట్ లో శివశంకర్ (56) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సిఐ జయనాయక్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృతుడు టైలరింగ్ వృత్తి చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.