కొండపి: పొన్నలూరు మండలం మాజీ టిడిపి మండల అధ్యక్షుడు అకాల మృతి, పలువురు విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించిన నేతలు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాజీ టిడిపి మండల అధ్యక్షుడు కోటేశ్వరరావు అకాల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం పొన్నలూరు మండలానికి వెళ్లి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనసేన ఇంచార్జ్ మనోజ్ కుమార్ తో పాటు పలువురు నేతలు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈరోజు సాయంత్రం కోటేశ్వరావు అంత్యక్రియలు పూర్తి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.