దర్శి: ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో కేరింతలు కొట్టిన విద్యార్థులు
Darsi, Prakasam | Apr 23, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించిన పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమతమ ఇళ్లకు వెళ్తూ కేరింతలు కొడుతూ కనిపించారు. అంతేకాక వారి ఆనందాన్ని కాగితపు ముక్కలు విసిరి వేస్తూ వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఆ దృశ్యాలను చూస్తూ పరవశించిపోయారు. గడియారం స్తంభం సెంటర్లో రోడ్లపై పేపర్ మొక్కలు చెల్లాచెదురుగా పడి ప్రత్యేక ఆకర్షణగా కనపడ్డాయి.