మార్కాపురం: జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగ కుండా ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత న జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగ కుండా ఆక్రమణలు తొలగించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఉన్న మూడు జాతీయ రహదారు లపై ఆక్రమణలు తొలగించ డానికి జాయింట్ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.