మార్కాపురం: నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణ సంబంధించి ఆయా విభాగాలు చేపట్టవలసిన వీధి విధానాలపై మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ... స్వర్ణ గ్రామ వార్డ్ కార్యాలయాల యందు లబ్ధిదారులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జెసి శ్రీనివాసులు డిఆర్డిఏ పిడి శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు.