దర్శి: కురిచేడు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
Darsi, Prakasam | May 13, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలోని జ్ఞాన ప్రసునాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కోతల బెడద రోజురోజుకు పెరుగుతుంది. దేవాలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయ ప్రాంగణంలో కోతులు భయపెడుతూ భక్తుల పూజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు భక్తులు దేవాలయానికి వెళ్ళడానికి భయపడుతున్నారు. దేవాలయంలోని కరెంటు సామాన్లను పూజా సామాగ్రిని చల్లా చదరం చేస్తూ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు తెలిపారు.