దర్శి: దర్శి లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 5 మందికి శిక్ష విధించిన కోర్టు
Darsi, Prakasam | Apr 17, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదు మందికి కోర్టు శిక్ష విధించినట్లు ఎస్సై మురళి తెలిపారు. ఐదు మందిలో ఇద్దరికీ మూడు రోజులు జైలు శిక్ష ముగ్గురికి పదివేల రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతే కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.