గిద్దలూరు: కంభంలో స్కూల్ బస్సులను తనిఖీ చేసి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు
సామర్థ్యానికి మించి స్కూల్ బస్సులలో విద్యార్థులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం జిల్లా కంభం ఎస్సై శివ కృష్ణారెడ్డి స్కూల్ బస్సుల నిర్వహణ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కంభం పట్టణంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. స్కూల్ బస్సులను నడుపుతున్న బస్సు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ తో పాటు పత్రాలు పరిశీలించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కళారావు, ఎస్సై శివ కృష్ణారెడ్డి ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు.