కొండపి: సింగరాయకొండ కలికివాయ ఫ్లైఓవర్ వద్ద డివైడర్ ని ఢీ కొట్టి బోల్తాపడ్డ ఆటో, డ్రైవర్కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున మామిడికాయల తోడుతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తుతో ఆటోను డివైడర్ ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డ ఆటో డ్రైవర్ ను హైవే పోలీసులు సింగరాయకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు నిద్ర మత్తుతో వాహనాలు నడిపి ప్రహ్మదాల బారిన పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.