మార్కాపురం: ఏడు సంవత్సరాల అనంతరం తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న కుమారుడు నవీన్
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లి గ్రామానికి చెందిన చాగలమర్రి యోహాన్ దంపతులు ఉపాధి కోసం 2019లో హైదరాబాదుకు వెళ్లారు. అక్కడ ఎనిమిదేళ్ల కుమారుడు నవీన్ అనుకోకుండా తప్పిపోయాడు. తప్పిపోయిన బాలుడిని పోలీసులు హైదరాబాదులోని తారా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కు అప్పగించారు. ఏడు సంవత్సరాల తర్వాత తన ఊరు లక్ష్మక్క పల్లి అని తనకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పడంతో ప్రతినిధులు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు