విశాఖపట్నం: పాత నగరంలోని జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో దేవాదయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శేష పాన్పు అవతారంలో జగన్నాథుడు
విశాఖలోని రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామిని ఆదివవారం శేషపాన్పు అవతారంలో అలంక రించారు. ట్రర్నర్ చౌల్ట్రీ ఆవరణలోని కల్యాణ మండపంలో జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకుల పర్యవేక్షణలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామి దర్శనం కల్పించారు పలు సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ అలరించాయి