తాడిపత్రి: తాడిపత్రి మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు
తాడిపత్రి మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. సజ్జెలదిన్నె గ్రామ పరిసర ప్రాంతాల్లోని పెన్నానది నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించి ఏడు ట్రాక్టర్లను పట్టుకుని తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.