నంద్యాల అర్బన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి : శక్తి టీం
Nandyal Urban, Nandyal | Nov 13, 2026
నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు శక్తి టీం సభ్యులు అవగాహన కల్పించారు. శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గుర్తుతెలియని లింకులు ఓపెన్ చేయవద్దన్నారు. ఎవరైనా ఓటిపి అడిగితే చెప్పవద్దన్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 కు ఫోన్ చేయాలన్నారు. తమ తల్లిదండ్రుల ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.