గిద్దలూరు: అర్ధవీడు, కంభం ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించిన పోలీసులు
చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను మార్కాపురం జిల్లా కంభం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాలయాలు, దుకాణాలు, యజమానులు లేని ఇళ్లను టార్గెట్ చేసి దొంగ చోరీలకు పాల్పడుతున్న విషయాన్ని మార్కాపురం డివిజన్ డిఎస్పి నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు. బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన భూపాని సాయి అర్ధవీడు, కంభం మండలాలలో 40 గ్రాముల బంగారాన్ని 25 తులాల వెండిని రూ.20 వేలు నగదును దొంగ అపహరించాడు.