దర్శి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఏపీ మోడల్ స్కూల్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజాబాబు టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించారు.