యర్రగొండపాలెం: ప్రగళ్లపాడు చెంచుగూడెంలో పోలీసులు కార్డెన్ సెర్చ్, ఏడు విల్లులు 30 అంబులు స్వాధీనం
పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు చెంచుగూడెంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదకరమైన ఏడు విల్లులు 30 అంబులు, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని ఆరు మోటర్ బైక్ లను సీజ్ చేశామని సీఐ అస్సాన్ తెలిపారు. ఎస్సై సైదు బాబు పాల్గొన్నారు