ఉరవకొండ: శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు అభిషేకాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీమంజునాథ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు మాస శివరాత్రి పూజలు అభిషేకాలను భక్త జనంతో కలిసి అర్చకులు నిర్వహించారు. విశిష్ట పూజలు పంచామృత అభిషేకాలను నిర్వహించి తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలను శ్రీ మంజునాథ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు దాతలతో కలసి నిర్వహించారు. పూజలు అనంతరం ఆలయంలో భజన కార్యక్రమాలను నిర్వహించారు.