గిద్దలూరు: కొమరోలు మండలం హనుమంతరాయన పల్లిలో శ్రీ పట్టాభి రామస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయన పల్లి గ్రామంలో శ్రీ పట్టాభి రామస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తర్వాత అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. తర్వాత గ్రామస్తుల తో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.