గిద్దలూరు: రాచర్లలో జరిగే బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత, పోలీసుల సూచనలు పాటించాలన్న సీఐ రామకోటయ్య
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసామని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తెలిపారు. బుధవారం రాచర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కోటేశ్వరరావు సిఐ రామకోటయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేకంగా ఆలయం వద్దకు ఉచిత వాహన సదుపాయాలు కల్పించామన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతంలోని వాహనదారులు తమ వాహనాలు నిలిపి ఉంచాలని పోలీసుల సూచనలు పాటించాలన్నారు.