రాయదుర్గం: బేలోడు గ్రామంలో వివాహిత బలవన్మరణం
గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో చాకలి శిరీష(27) ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శివరాజ్‌తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త బెంగళూరులో కూలిపనులు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.