తాడిపత్రి: టీ టీ డీ చైర్మన్ బీ ఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలి: తాడిపత్రిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేరం స్వర్ణలత
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేరం స్వర్ణలత డిమాండ్ చేశారు. తాడిపత్రిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వైసీపీ శ్రేణులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. బీ ఆర్ నాయుడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. బీ ఆర్ నాయుడును తొలగించే వరకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.