కొండపి: పొన్నలూరు మండలంలోని జగనన్న కాలనీలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వేంపాడు జగనన్న కాలనీలో పేకాట ఆడుతున్న ముగ్గురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 3,730 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టారీత్యా నేరమని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.