రాయదుర్గం: ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు గారు మీకిది తగదు : కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆగ్రహం
అధిక ధరలకు మద్యం విక్రయాలపై ప్రశ్నించినందుకు తనపై టీడీపీ సోషల్ మీడియా వారు మార్ఫింగ్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కుక్కలతో పోల్చారని మండిపడ్డారు. తాను ప్రజల పట్ల విశ్వాసంతో ఉన్నానని, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కనకపు సింహాసనంపై కూర్చోబెట్టిన ప్రజలకు విశ్వాసంగా లేరని విమర్శించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు.