రాయదుర్గం: గ్యాస్ ప్రమాదాలపై పట్టణంలో అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది
గ్యాస్ సిలిండర్ నుంచి వచ్చే మంటలు, పేలుడు వంటి సందర్భాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అగ్నిమాపక సిబ్బంది ప్రయోగాత్మకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రాయదుర్గం పట్టణంలోని పూసల వీధి, శాంతినగర్ ప్రాంతాలలో ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వంటింట్లో గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. నాసిరకం రెగ్యులేటర్, పైపులు వాడవద్దని కోరారు.