దర్శి: దర్శి లోని పాత ఎమ్మార్వో కార్యాలయంలోకి గ్రంథాలయం మార్చాలని జాయింట్ కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన ఇన్ ఛార్జ్ లక్ష్మి
Darsi, Prakasam | Apr 24, 2026 ప్రకాశం జిల్లా దర్శి లోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో గ్రంధాలయం ఏర్పాటుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ లక్ష్మి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దర్శిలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రైవేటు భవనంలో గ్రంథాలయం నిర్వహిస్తున్నారని దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు లక్ష్మీ వెల్లడించారు. ఖాళీగా ఉన్న పాత ఎమ్మార్వో కార్యాలయానికి గ్రంధాలయాన్ని మార్చి సహకరించాలన్నారు. సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.