గిద్దలూరు: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పై గిద్దలూరు పోలీస్ స్టేషన్లో వైసిపి నాయకులు ఫిర్యాదు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై పంతం నానాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల సమయంలో జగనన్న సభకు వచ్చే ప్రజలను చూస్తే చాలు పంతం నానాజీ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయడం మానుకుంటాడని ఎద్దేగా చేశారు. ప్రతిపక్ష నేతతో మర్యాదగా మాట్లాడలే కానీ ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు నాగార్జున రెడ్డి తెలిపారు.