యర్రగొండపాలెం: దోర్నాలలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు, ఆనందంతో కేరింతలు కొట్టిన విద్యార్థులు
మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం చివరి పరీక్ష పూర్తి కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. స్నేహితులతో కలిసి కేరింతలు కొట్టారు. పలుచోట్ల విద్యార్థులు ఫోటోలు దిగుతూ భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడుకుంటూ కనపడ్డారు. తల్లిదండ్రులు పిల్లలని ఆనందంగా ఇళ్లకు తీసుకెళ్లారు.