మార్కాపురం: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పొదిలిలో దళిత మహాసభ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
మార్కాపురం జిల్లా పొదిలి లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని దళిత మహాసభ జిల్లా కార్యదర్శి ధర్మాస పెద్దన్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులలోని మూడవ పేజీని తొలగించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల మత స్వాతంత్ర హక్కులను హరిస్తున్న నిబంధనలను వ్యతిరేకించారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.