గిద్దలూరు: గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టిన స్థానిక రైల్వే పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వివరాలు తెలియవలసి ఉందని మృతుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడ లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాన్ని విచారణలో గుర్తించవలసి ఉందని అధికారులు అన్నారు.