మార్కాపురం: గోగినేని వారి పాలెం పోలేరమ్మ గుడి లో అమ్మవారి కిరీటం ముక్కుపుడక దొంగతనం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మార్కాపురం జిల్లా పొదిలి మండలం గోగినేని వారి పాలెం లో పోలేరమ్మ గుడి తాళం పగలగొట్టి దుండగులు అమ్మవారి నగలు దొంగతనం చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. అమ్మవారికి అలంకరించిన 700 గ్రాముల వెండి కిరటం ముక్కుపుడక ఆలయంలో ఉన్న హుండీ దొంగతనం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు పొదిలి సీఐ రాజేష్ కుమార్ సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.