దర్శి: కురిచేడు మండలం తూర్పు హరిజనవాడలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన డి.ఎస్.పి బాలమురళీకృష్ణ
Darsi, Prakasam | May 24, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం తూర్పు హరిజనవాడలో డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఇండ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా అని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని ఏడూ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.