గిద్దలూరు: గిద్దలూరులో పర్యటించిన డీఈవో సుబ్బారావు, ప్రభుత్వ పాఠశాలల్లో 100% విద్యార్థుల లక్ష్యంగా పనిచేస్తున్నాం అని వెల్లడి
మార్కాపురం జిల్లా గిద్దలూరులో డీఈవో సుబ్బారావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం విద్యార్థుల నమోదు లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.