యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు తండాలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుల్లలచెరువు తండాకు ఓ యువకుడు (24) ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.