తాడిపత్రి: ఫేక్ న్యూస్ ను నమ్మొద్దు, సర్క్యులేట్ చేయవద్దు: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
ఫేక్ న్యూస్ ను నమ్మొద్దు, సర్కులేట్ చేయవద్దని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రజలకు సూచించారు. తాడిపత్రిలోని తన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన మాట్లాడారు. తాడిపత్రిలో జరుగుతున్న హత్యలకు సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయన్నారు. అయితే ఎవరు అలాంటి న్యూస్ను నమ్మొద్దండన్నారు. పోలీసులు, విశ్వసనీయ వ్యక్తులు వెల్లడించే న్యూస్ను మాత్రమే విశ్వసించాలన్నారు. తాడిపత్రి డివిజన్ ప్రశాంతతకు సహకరించాలన్నారు. ఫేక్ న్యూస్ ను సర్క్యులేట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.