కొండపి: టంగుటూరులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకి కుట్టు మిషన్పై ఉచిత శిక్షణ
టంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శనివారం బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకి ఉచిత కుట్టు మిషన్పై శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. మహిళలు శిక్షణను ఉపయోగించుకొని ఆర్ధికంగా ఎదగాలని ఎంపీడీవో దేవసేన కుమారి ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, బీసీ కార్పొరేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.