గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెరిగిన ఉష్ణోగ్రతలను గమనించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లతోపాటు మండలాలలోని ప్రధాన ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.