దంతాలపల్లి: మహబూబాబాద్‌లో గుడుంబా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి
మహబూబాబాద్ జిల్లా దంతులపల్లి మండలం తూర్పు తండాలో పోలీసులు గుడుంబా తయారీదారులపై దాడులు చేశారు. 10 లీటర్ల నాటుసారా, 20 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని, 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.