గిద్దలూరు: రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ చరిత్ర
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం చరిత్ర పబ్లిక్ యాప్ మీకు ప్రత్యేకంగా అందిస్తుంది. ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు రంగనాయక స్వామి గా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు రంగనాయక స్వామి వారి పేరును తమ పిల్లలకు ఇంటికి ఒకరికి పెట్టుకుంటుంటారు. సుద్దిగా లేకుండా ఆలయం వద్దకు వచ్చే వారిని తేనె తీగల పుట్టి తరిమివేస్తాయని అనాదిగా నమ్ముతారు. ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండం ఎంత లోతు ఉందో ఇప్పటికీ తెలవకపోవడం ఓ ప్రత్యేకత.