తాడిపత్రి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి: పెద్దవడుగూరులో సీపీఐ మండల కార్యదర్శి వెంకట రాముడు
జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని పెద్దవడుగూరు సీపీఐ మండల కార్యదర్శి వెంకటరాముడు డిమాండ్ చేశారు. పెద్దవడుగూరు లోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు పాదయాత్ర చేపట్టామన్నారు. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.