మార్కాపురం: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాంబాబు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో దివంగత వైయస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ డాక్టర్ వైయస్సార్ చూపిన బాటలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రజలకు అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను ఎండగడుతూ వైయస్సార్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తి ప్రజలకు ఉపయోగపడే విధంగా వైయస్సార్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేస్తూనట్లు పేర్కొన్నారు.