తాడిపత్రి: యాడికి, వెంకటలక్ష్మి అనే వృద్ధురాలిని అయినవారు వదిలేశారు, ఏమీ కాని వారు అక్కున చేర్చుకున్నారు
యాడికి మండల కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వయసు పైబడింది. ఏడు పదులు దాటాయి. కొడుకు, కుమార్తెలు ఆమె ఆలనా పాలనా పట్టించుకోలేదు. యాడికి లోనే అగాపే వృద్ధాశ్రమాన్ని నిర్వహించే ప్రసాద్ స్పందించారు. గత మూడేళ్లుగా ఆమె ఆలనా పాలన చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం వెంకటలక్ష్మి అనారోగ్యానికి గురైంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినా స్పందించలేదు. మూడు రోజులుగా ప్రసాద్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. స్నానం చేయించాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యులను పిలిపించి వైద్యం చేయించాడు.అయినవారు వదిలేసిన ఏమి కాని వ్యక్తి అక్కున చేర్చుకున్నాడు.